TG Govt: సినీ ప్రముఖుల ముందు తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలు ఇవే
- ముఖ్యమంత్రి రేవంత్ తో సినీ ప్రముఖుల సమావేశం
- పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్న సీఎం
- బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండకపోవచ్చని సమాచారం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కాబోతున్నారు. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు. అంతకు ముందే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహతో పాటు సినీ పరిశ్రమకు చెందిన 36 మంది ప్రముఖులు అక్కడకు చేరుకున్నారు. సినీ ప్రముఖులతో మంత్రులు ప్రాథమిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున సినీ ప్రముఖుల ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ కు ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదనలు:
- డ్రగ్స్ కు వ్యతిరేకంగా సినిమా హీరోలు, హీరోయిన్లు ప్రచార కార్యక్రమాల్లో కచ్చితంగా పాల్గొనాలి.
- గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహించాలి.
- సినిమా టికెట్లపై విధించే సెస్సును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాలకు వినియోగించాలి.
- కులగణన సర్వే ప్రచార కార్యక్రమానికి సినీ తారలు సహకరించాలి.
- బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండకపోవచ్చు.