Hyderabad: ట్రాఫిక్ చలాన్ల రాయితీ ప్రచారంపై స్పందించిన అధికారులు

Hyderabad traffic police clarifies on traffic challan discount

  • మరోసారి పెండింగ్ చలాన్లపై రాయితీ అంటూ జోరుగా ప్రచారం
  • తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్న ట్రాఫిక్ అదనపు సీపీ
  • రాయితీ ఇస్తే అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడిస్తామని వెల్లడి

పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీ ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఖండించారు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ఎలాంటి రాయితీ లేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం మరోసారి రాయితీ ఇచ్చిందంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. రాయితీ వంటి అంశాలు ఉంటే తాము ముందుగానే ప్రకటిస్తామని వెల్లడించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఏదైనా ఉంటే https://echallan.tspolice.gov.in/publicview/ వెబ్ సైట్ ద్వారా వెల్లడిస్తామన్నారు. ఈ వెబ్‌సైట్‌లో వచ్చిన సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు. ఎవరికైనా అనుమానాలు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్లు 040-27852772 లేదా 27852721 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News