Revanth Reddy: అల్లు అర్జున్ పై నాకెందుకు కోపం ఉంటుంది?: రేవంత్ రెడ్డి

 Why am I angry with Allu Arjun asks Revanth Reddy

  • అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి తెలుసన్న రేవంత్
  • ఇద్దరూ తనతో కలిసి తిరిగిన వారే అని వ్యాఖ్య
  • అందరూ చట్ట ప్రకారం వ్యవహరించాలనేదే తన విధానమన్న సీఎం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ప్రస్తావన రావడంతో రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ పై తనకు కోపం ఎందుకుంటుందని ఆయన ప్రశ్నించారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని చెప్పారు. వారిద్దరూ తనతో కలిసి తిరిగిన వారే అని అన్నారు. 

వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ... అందరూ చట్ట ప్రకారం వ్యవహరించాలనేది తన విధానమని చెప్పారు. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ కు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సినీ పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో చేశాయని... ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఐటీ, ఫార్మా మాదిరే సినీ పరిశ్రమను కూడా ప్రోత్సహిస్తామని తెలపారు.

  • Loading...

More Telugu News