New Year 2025: నూతన సంవత్సర వేడుకల వేళ మార్గదర్శకాలు జారీ చేసిన విశాఖ సీపీ

Visakha CP issues guide lines ahead of new year eve

  • మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరాది
  • విశాఖలో హోటళ్లు, క్లబ్ లు, పబ్ లకు మార్గదర్శకాలు
  • డిసెంబరు 31 రాత్రి ఒంటి గంట వరకే అనుమతి

మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం ఆగమనం చేస్తోంది. ఈ నేపథ్యంలో, విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్ లు, క్లబ్ లకు మార్గదర్శకాలు జారీ చేశారు. డిసెంబరు 31న హోటళ్లు, క్లబ్ లు, పబ్ ల నిర్వహణకు రాత్రి ఒంటి గంట వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. 

ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈవెంట్ల నిర్వహణ స్థలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈవెంట్లలో అశ్లీలత ఉండరాదని, నిర్ణీత స్థాయికి మించి శబ్దస్థాయి దాటరాదని పేర్కొన్నారు. ఈవెంట్లలో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 

డ్రంకెన్ డ్రైవ్ చేస్తే రూ.10 వేల ఫైన్ లేదా ఆర్నెల్ల జైలు శిక్ష ఉంటాయని... డ్రైవింగ్ లైసెన్స్ ను మూడు నెలలు, లేదా అంతకంటే ఎక్కువకాలం, లేదా పర్మినెంటుగా రద్దు చేస్తారని స్పష్టం చేశారు.

మహిళలకు ఇబ్బందులు ఉంటే వెంటనే షీ టీమ్ లను సంప్రదించాలని సీపీ సూచించారు.

  • Loading...

More Telugu News