Manmohan Singh: మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళి అర్పించిన మోదీ, అమిత్ షా.. ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు
- మోతీలాల్ నెహ్రూ మార్గ్ లోని నివాసంలో మన్మోహన్ పార్థివదేహం
- మన్మోహన్ భార్యను ఓదార్చిన మోదీ
- మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించనున్న చంద్రబాబు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళి అర్పించారు. ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్ లో ఉన్న మన్మోహన్ నివాసంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. కాసేపటి క్రితం మన్మోహన్ నివాసానికి మోదీ, అమిత్ షా వెళ్లారు. ఆయన పార్థివదేహానికి నివాళి అర్పించిన అనంతరం... ఆయన భార్యతో మోదీ మాట్లాడారు. ఆమెను ఓదార్చారు. మన్మోహన్ మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు.
మరోవైపు, ఈ మధ్యాహ్నం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరుతున్నారు. మన్మోహన్ సింగ్ కు చంద్రబాబు నివాళి అర్పించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాజీ ప్రధాని పార్థివదేహానికి నివాళి అర్పించనున్నారు.