Registration Offices: ఏపీలో రద్దీగా మారిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు

Huge rush at registration offices in AP

  • ఏపీలో పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు
  • తొలుత జనవరి 1 నుంచి ధరలు పెంచాలనుకున్న కూటమి సర్కారు
  • ఇంకా కసరత్తులు కొనసాగుతుండడంతో ఆ నిర్ణయం వాయిదా
  • ఈ నేపథ్యంలో, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు

ఏపీలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చార్జీల పెంపుదలపై ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వం ముందుంచారు. జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలను అమలు చేయాలని భావించినప్పటికీ, విధివిధానాలపై కసరత్తులకు మరికొంత సమయం పట్టేట్టు ఉండడంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. 

ఇక, కొత్త చార్జీల అమలు ఎప్పటి నుంచి అనేది కచ్చితంగా తెలియకపోయినప్పటికీ... రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ఖాయమైన నేపథ్యంలో, ఇవాళ రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీతో కిటకిటలాడాయి. చార్జీలు పెంచేంత వరకు ఆగకుండా... ఆస్తుల రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద కోలాహలం నెలకొంది. సాధారణ దినాలతో పోల్చితే రెట్టింపు సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. 

కాగా, కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలపై సోమవారం నాడు స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News