Sonia Gandhi: మన్మోహన్ కు కడసారి వీడ్కోలు పలికిన సోనియా

Sonia Gandhi pays tributes to former prime minister Manmohan Singh
  • నిన్న రాత్రి కన్నుమూసిన మన్మోహన్ సింగ్
  • నేడు మన్మోహన్ నివాసానికి వచ్చిన సోనియా, రాహుల్
  • మన్మోహన్ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచిన సోనియా
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

సోనియా గాంధీ నిన్న అస్వస్థతకు గురయ్యారు. అయితే, పార్టీలో కురువృద్ధుడిగా పేరుగాంచిన మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో, ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి నేడు మన్మోహన్ నివాసానికి వచ్చారు. మన్మోహన్ సింగ్ పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. మాజీ ప్రధాని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె వెంట తనయుడు రాహుల్ గాంధీ ఉన్నారు.
Sonia Gandhi
Manmohan Singh
Tributes
New Delhi
Congress

More Telugu News