Manmohan Singh: కుమార్తె వచ్చాకే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

Manmohan Singh last rites will be tomorrow after his daughter arrival from abroad
  • గత రాత్రి కన్నుమూసిన మన్మోహన్ సింగ్
  • అమెరికా నుంచి బయల్దేరిన కుమార్తె
  • ఈ అర్ధరాత్రి తర్వాత భారత్ చేరుకునే అవకాశం
  • మన్మోహన్ అంత్యక్రియలు రేపు జరుగుతాయన్న కాంగ్రెస్ వర్గాలు
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన కాసేపటికే తుది శ్వాస విడవడం తెలిసిందే. రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ ఇక లేరన్న వార్త తెలిసి యావత్ భారతావని విచారంలో మునిగిపోయింది. మన్మోహన్ భౌతికకాయం ప్రస్తుతం ఢిల్లీలోని నివాసంలో ఉంది. ఆయనకు పూర్తిస్థాయి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన పార్థివదేహంపై జాతీయ పతాకాన్ని కప్పి ఉంచారు. 

కాగా, మన్మోహన్ సింగ్ కుమార్తెల్లో ఒకరు అమెరికా నుంచి రావాల్సి ఉండడంతో, ఆయన అంత్యక్రియలను రేపు నిర్వహించనున్నారు. ఆమె అమెరికాలో విమానం ఎక్కినట్టు తెలుస్తోంది. నేటి అర్ధరాత్రి తర్వాత భారత్ చేరుకుంటారని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ వెల్లడించారు. 

ఇక, ప్రజల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని ఢిల్లీలోని పార్టీ కార్యాలయానికి తరలించనున్నామని, అయితే దీనికి సంబంధించిన కార్యాచరణ మన్మోహన్ కుమార్తె వచ్చాక ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.
Manmohan Singh
Last Rites
Daughter
USA
New Delhi
India
Congress

More Telugu News