Zomato: బిర్యానీయే టాప్... జొమాటో 2024 నివేదిక విడుదల

Biryani tops the orders list of Zomata in 2024

  • మరి కొన్ని రోజుల్లో ముగియనున్న 2024 సంవత్సరం
  • ఇయర్ ఎండ్ రిపోర్ట్ విడుదల చేసిన జొమాటో
  • 2024లో 9.13 కోట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని వెల్లడి
  • తర్వాతి స్థానంలో పిజ్జా ఆర్డర్లు

మరి కొన్ని రోజుల్లో 2024 సంవత్సరానికి ముగింపు కార్డు పడనుంది. ఈ నేపథ్యంలో, ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో 2024 సంవత్సర ముగింపు నివేదిక విడుదల చేసింది. ఇందులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 

జనాలు ఈ ఏడాది అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటెమ్స్ లో బిర్యానీదే నెంబర్ వన్ ప్లేస్ అని జొమాటో వెల్లడించింది. 2024లో 9,13,99,110 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని తెలిపింది. ఆ తర్వాత స్థానంలో 5,84,46,908 పిజ్జా ఆర్డర్లు వచ్చాయట. 

ఇక, రైల్వే టికెటింగ్ పోర్టల్ ఐఆర్ సీటీసీతోనూ జొమాటోకు భాగస్వామ్యం ఉంది. జొమాటో నిర్దేశిత రైల్వే స్టేషన్ల నుంచి, రైలు ప్రయాణికులకు వారు కోరుకున్న ఆహారాన్ని సరఫరా చేస్తుంటుంది. ఓసారి ఓ వ్యక్తి రైలులో ప్రయాణిస్తూ 120 మంచూరియా కాంబోలు ఆర్డర్ చేశాడని జొమాటో తన నివేదికలో వెల్లడించింది. అయితే అవన్నీ అతడి ఒక్కడి కోసమే కాదట... ఆ కంపార్ట్ మెంట్ లో ఉన్న అందరి కోసం ఆర్డర్ చేశాడని వివరించింది. 

ఇక, తన నివేదికలో మరికొన్ని ఆసక్తికర అంశాలను కూడా జొమాటో పంచుకుంది. ఢిల్లీకి చెందిన ఓ ఆహార ప్రియుడు ఈ ఏడాది 1,377 రెస్టారెంట్ల నుంచి ఫుడ్ తెప్పించుకున్నాడని వెల్లడించింది. 

2024లో... 17 మిలియన్ ప్యాక్ ల మ్యాగీ నూడిల్స్, 10 మిలియన్ క్యాన్ల కోకాకోలా ఆర్డర్లు బుక్ అయ్యాయట. ఒక వ్యక్తి 1,203 స్ప్రైట్ బాటిల్స్ ఆర్డర్ చేసినట్టు జొమాటో తెలిపింది.

  • Loading...

More Telugu News