Manmohan Singh: మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర కేబినెట్లోకి నా పేరును పరిశీలించారు: వీహెచ్
- మన్మోహన్ మృతి దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్న వీహెచ్
- ఓబీసీ కన్వీనర్‌గా మన్మోహన్ సింగ్‌తో కలిసి పని చేసే అవకాశం వచ్చిందన్న వీహెచ్
- దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచస్థాయిలో నిలిపారన్న వీహెచ్
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో తనను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవడానికి తన పేరును పరిశీలించారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి, దేశానికి తీరని లోటు అన్నారు. ఆర్థికవేత్తగా, ప్రధానిగా ప్రపంచస్థాయిలో దేశ ఆర్థిక వ్యవస్థను నిలిపారన్నారు.
తాను ఓబీసీ కన్వీనర్‌గా ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్‌తో కలిసి పని చేసే అవకాశం వచ్చిందన్నారు. ఓబీసీలకు ఐఐటీ, ఐఐఎంలలో రిజర్వేషన్ కోరామని, ఆయన వెంటనే అంగీకరించి బిల్లును ప్రవేశ పెట్టారని తెలిపారు. మన్మోహన్ సింగ్ కుటుంబానికి ఆ దేవుడు అండగా నిలవాలని ప్రార్థిస్తున్నానన్నారు.