Nitish Kumar Reddy: మెల్‌బోర్న్ టెస్ట్.. భారత్‌కు ఫాలో ఆన్ గండం తప్పించిన తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్.. తగ్గేదేలే అంటూ సంబరాలు!

Nitish Kumar Reddy Half Century Taggedele

  • టెస్టుల్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసిన నితీశ్‌కుమార్‌రెడ్డి
  • ఆ వెంటనే ‘తగ్గేదేలే’ అంటూ సంబరాలు
  • 275 పరుగులకు చేరుకోగానే తప్పిన ఫాలో ఆన్ గండం

ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్‌రెడ్డి చలువతో భారత జట్టు ఫాలో ఆన్ గండం నుంచి బయటపడింది. 221 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును నితీశ్ ఆదుకున్నాడు. ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ టెస్టుల్లో తొలి అర్ధ సెంచరీ నమోదు చేశాడు. హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్న వెంటనే ‘తగ్గేదేలే’ అనే మేనరిజంతో సంబరాలు చేసుకున్నాడు. 

నితీశ్‌కు వాషింగ్టన్ సుందర్ అండగా నిలిచాడు. ఇద్దరూ కలిసి నెమ్మదిగా పరుగులు సాధిస్తూ భారత్‌ను కష్టాల నుంచి గట్టెక్కించారు. 275 పరుగుల మార్కును చేరుకోగానే భారత జట్టుకు ఫాలో ఆన్ గండం తప్పింది. టీమిండియా ప్రస్తుతం ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ 66 పరుగులు, సుందర్ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News