unstoppable latest episode: నాకు మొత్తం ఎనిమిది మంది పిల్లలు: విక్టరీ వెంకటేశ్

unstoppable latest episode venkatesh balakrishna

  • అన్‌స్టాపబుల్ 4వ సీజన్ తాజా ఎపిసోడ్‌లో సందడి చేసిన హీరో వెంకటేశ్
  • కుమారుడు అర్జున్ ఇండస్ట్రీలోకి ఎప్పుడొస్తాడనేది వేచి చూడాల్సిందేనన్న వెంకటేశ్
  • అర్ధాంగి నీరజ బెస్ట్ ప్రెండ్‌ 

బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ 4వ సీజన్ తాజా ఎపిసోడ్‌లో హీరో వెంకటేశ్, ఆయన సోదరుడు సురేశ్ బాబు, 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు భీమ్స్ పాల్గొని సందడి చేశారు. 

ఈ సందర్భంలో వెంకటేశ్ అనేక విషయాలను బాలకృష్ణతో పంచుకున్నారు. కుటుంబ సభ్యుల విషయం గురించి చెబుతూ తనకు ఇద్దరు కుమార్తెలని, ఇద్దరికీ వివాహమైందని చెప్పారు. పిల్లలు వాళ్ల అమ్మకంటే తనతోనే ఓపెన్‌గా ఉంటారని చెప్పిన వెంకటేశ్.. వారి కేరీర్ విషయంలో తన గైడెన్స్ తక్కువేనన్నారు. ఎవరికి ఏది నచ్చితే అది చేయమని చెబుతానని అన్నారు. వీరే కాదు, రానా, చైతన్య .. ఇలా మొత్తం తనకు 8 మంది పిల్లలని, అందరూ తనకు సమానమేనని పేర్కొన్నారు. 

కుమారుడు అర్జున్ (20) అమెరికాలో చదువుతున్నాడని, తనకంటూ కలలు ఉన్నాయన్నారు. ఇండస్ట్రీకి ఎప్పుడు వస్తాడనేది వేచి చూడాల్సిందేనన్నారు. భార్య నీరజను బెస్ట్ ఫ్రెండ్‌గా ఆయన అభివర్ణించారు. అన్న సురేశ్ బాబు తమ కుటుంబానికి మూల స్తంభంగా వెంకటేశ్ పేర్కొన్నారు. తండ్రి రామానాయుడిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైన వెంకటేశ్..ఆయన తనయుడిని అయినందుకు గర్వపడుతున్నానన్నారు. 

  • Loading...

More Telugu News