Manmohan Singh: మన్మోహన్ చితికి నిప్పు అంటించింది ఎవరంటే...!

Manmohan daughter done his last rites
  • నిగంబోధ్ ఘాట్ లో ముగిసిన అంత్యక్రియలు
  • మన్మోహన్ పాడె మోసిన రాహుల్ గాంధీ
  • చితికి నిప్పు అంటించిన మన్మోహన్ కుమార్తె
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ లో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ... మన్మోహన్ సింగ్ పాడెను మోశారు. సిక్కు సంప్రదాయాలను ప్రకారం అంత్యక్రియలను నిర్వహించారు. చితికి నిప్పు అంటించే ముందు ప్రార్థనలను నిర్వహించారు. మన్మోహన్ చితికి ఆయన కుమార్తె నిప్పు అంటించారు. మన్మోహన్ అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి ధన్కడ్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్ర నేతలు, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు.
Manmohan Singh
Congress

More Telugu News