Manmohan Singh: ఎల్లుండి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

A special meeting is scheduled for Monday December 30 to pay tribute to former PM Manmohan Singh
  • మన్మోహన్ మృతి పట్ల సంతాపం ప్రకటించనున్న అసెంబ్లీ
  • మన్మోహన్ సింగ్‌కు నివాళులు అర్పించనున్న తెలంగాణ అసెంబ్లీ
  • ఎల్లుండి మంత్రివర్గ సమావేశం వాయిదా
తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 30న ప్రత్యేకంగా సమావేశం కానుంది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇటీవల ముగిశాయి. ఈ సమావేశాలు ముగిసిన కొన్నిరోజుల్లోనే తిరిగి ఒకరోజు అసెంబ్లీ సమావేశం జరగనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రెండు రోజుల క్రితం తుది శ్వాస విడిచారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.

మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ అసెంబ్లీ సమావేశమై సంతాపం ప్రకటించనుంది. సంతాప దినాల్లో భాగంగా దివంగత మన్మోహన్‌కు శాసనసభ నివాళులు అర్పించనుంది. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది తొలి సంతాప సభ.

మంత్రివర్గ సమావేశం వాయిదా

ఎల్లుండి అసెంబ్లీ అత్యవసర అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో అదే రోజున జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా పడింది.
Manmohan Singh
Telangana
Congress

More Telugu News