Anna University rape case: అన్నా యూనివర్సిటీ ఘటనపై మహిళా అధికారులతో సిట్ ఏర్పాటుకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు

Madras HC orders SIT probe in Anna University rape case
  • ముగ్గురు అధికారిణులతో సిట్ ఏర్పాటు చేయాలన్న మద్రాస్ హైకోర్టు
  • బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం
  • బాధిత విద్యార్థిని చదువు ప్రభావం కాకుండా చూడాలన్న హైకోర్టు
తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై అత్యాచార ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో పోలీసులు, ప్రభుత్వం తీరును నిరసిస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కొరడాతో కొట్టుకున్నారు. తాజాగా, ఈ అత్యాచార ఘటనపై దర్యాఫ్తు కోసం మహిళా పోలీస్ అధికారులతో సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. అలాగే, బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేశారు.

మరోవైపు, ఈ కేసు దర్యాఫ్తును సీబీఐకి బదిలీ చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జస్టిస్ ఎస్.ఎం. సుబ్రమణ్యం, జస్టిస్ వి.లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిపింది.

అనంతరం, కేసు దర్యాఫ్తు కోసం ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ ఘటన నేపథ్యంలో బాధిత విద్యార్థిని చదువు ప్రభావితం కాకుండా చూడాలని సూచించింది. అన్నా యూనివర్సిటీ బాధిత మహిళ నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.
Anna University rape case
Madras High Court
Tamil Nadu

More Telugu News