Nitish Kumar Reddy: గవాస్కర్ కు పాదాభివందనం చేసిన నితీశ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు
- మెల్బోర్న్ టెస్టులో నితీశ్ వీరోచిత శతకం
- కుటుంబ సభ్యుల్లో మిన్నంటిన ఆనందోత్సాహాలు
- గవాస్కర్ ను కలిసి తమ ఆనందాన్ని పంచుకున్న వైనం
మెల్బోర్న్ టెస్టులో నితీశ్ కుమార్ రెడ్డి సెన్సేషనల్ సెంచరీ సాధించడంతో అతడి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ప్రస్తుతం మెల్బోర్న్ లోనే ఉన్న నితీశ్ తండ్రి, తల్లి, సోదరి భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ను కలిసి తమ సంతోషాన్ని ఆయనతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా నితీశ్ తండ్రి, తల్లి, సోదరి... గవాస్కర్ కు పాదాభివందనం చేశారు. అనంతరం నితీశ్ తండ్రిని గవాస్కర్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. నితీశ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువచ్చినందుకు భుజం తట్టి అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.