Revanth Reddy: మంత్రి కోమటిరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్

CM Revanth Reddy appreciates via phone on RRR works to be begin soon
  • రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం ప్రకటన
  • కోమటిరెడ్డిని ఫోన్ లో అభినందించిన రేవంత్ రెడ్డి
  • మీ కృషి వల్లేనంటూ బదులిచ్చిన కోమటిరెడ్డి 
రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగం నిర్మాణానికి టెండర్ల ప్రక్రియకు కేంద్రం ప్రకటన చేయడం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆర్ఆర్ఆర్ పనులకు కీలక ముందడుగు పడడంతో... మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడారు. 

అందుకు కోమటిరెడ్డి బదులిస్తూ... మీ చొరవ, కృషి, సహకారం, సలహాలతోనే ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పట్టాలెక్కిందని రేవంత్ రెడ్డిని ప్రశంసించారు. 2017లో ఆగిపోయిన ప్రాజెక్టు... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే మీ సహకారం వల్ల తిరిగి ప్రారంభమైందని కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
Revanth Reddy
Komatireddy Venkat Reddy
RRR Works
Congress
Hyderabad
Telangana

More Telugu News