Game Changer: మన ఫ్యాన్స్ కు చిరంజీవి ఈ మాట చెప్పమన్నారు: దిల్ రాజు

Dil Raju shares interesting thing about Game Changer
  • విజయవాడలో 256 అడుగుల ఎత్తయిన రామ్ చరణ్ కటౌట్
  • ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన దిల్ రాజు
  • ఈ మధ్యాహ్నం చిరంజీవి గేమ్ చేంజర్ సినిమా చూశారని వెల్లడి
  • సంక్రాంతికి మామూలుగా కొట్టడంలేదని ఫ్యాన్స్ కు చెప్పమన్నారని వివరణ
భారతదేశంలో మరెక్కడా లేని విధంగా విజయవాడలో 256 అడుగుల ఎత్తయిన రామ్ చరణ్ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు చీఫ్ గెస్టుగా వచ్చారు. ఆయన తన ప్రసంగిస్తూ... స్టేజిపై నుంచే గేమ్ చేంజర్ గురించి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. 

"ఇవాళ విజయవాడకు బయల్దేరే ముందు మధ్యాహ్నం ఒంటి గంటకు చిరంజీవి గారికి ఫోన్ చేశాను. సార్ సినిమా (గేమ్ చేంజర్) రెడీ అయింది... అప్పుడు మీరు (రషెస్) చూశారు... ఇప్పుడు ఫైనల్ మిక్స్ రెడీ అయింది... మీరు చూడాలి అన్నాను. సరే ఇంటికి పంపించు రాజు... చూస్తాను అన్నారు. చిరంజీవి గారు 2.45 గంటలకు సినిమా చూడడం మొదలుపెట్టారు. 

నేను హైదరాబాద్ నుంచి బయల్దేరాను గానీ, నా మనసంతా అక్కడే ఉంది. ఏ సీన్ ను ఎలా చూస్తున్నారో, ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అని ఆలోచిస్తున్నాను. కరెక్ట్ గా ఈ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ కూర్చున్నాను... చిరంజీవి గారి నుంచి ఫోన్ వచ్చింది. సార్... రామ్ చరణ్ కటౌట్ ఆవిష్కరణ కోసం విజయవాడ వచ్చాను అని ఆయనతో చెప్పాను. ఆయన ఒకటే మాటన్నారు... మన ఫ్యాన్స్ కు చెప్పు... సంక్రాంతికి మనం మామూలుగా కొట్టడంలేదు అన్నారు. 

జనవరి 10న గేమ్ చేంజర్ థియేటర్లలోకి వస్తోంది. ఆ రోజున మెగా పవర్ స్టార్ లో మెగాను చూస్తారు, పవర్ ను చూస్తారు. నాలుగేళ్ల కిందటే శంకర్ గారు ఈ సినిమా కథ చెప్పారు. ఇందాక చిరంజీవి గారు ఒక్కొక్క సీన్ గురించి చెబుతుంటే ఎంతో ఆనందం వేసింది.

జనవరి 10న రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారు. కొద్దిసేపు ఐఏఎస్ ఆఫీసర్ గా, కొద్దిసేపు పోలీసాఫీసర్ గా, కొద్దిసేపు రాజకీయనేతకు ఉండాల్సిన లక్షణాలతో రామ్ చరణ్ కనిపిస్తాడు. శంకర్ మార్కు టేకింగ్ తో సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. రేపు బిగ్ స్క్రీన్స్ పై మీరు చూడబోయే ఐదు పాటలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టుగా ఉంటాయి. 

ఇక శంకర్ గారిని సినిమా రన్ టైమ్ గురించి ఒకటే అడిగాను. సార్... ఇది తెలుగు సినిమా... మాకు సినిమా రన్ టైమ్ 2 గంటల 45 నిమిషాలే ఉండాలి అని చెప్పాను. ఆయన కూడా అందుకు తగ్గట్టుగానే తెరకెక్కించారు" అని దిల్ రాజు వివరించారు.
Game Changer
Ram Charan
Chiranjeevi
Dil Raju
Vijayawada

More Telugu News