Australia vs India: 87 ఏళ్ల రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన భారత్, ఆసీస్ బాక్సింగ్ డే మ్యాచ్!
- ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి 5రోజుల్లో 3,51,100 మందికి పైగా ప్రేక్షకుల హాజరు
- 1937లో ఆసీస్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌కు 3,50,534 మంది ప్రేక్షకులు
- మొత్తంగా ఈ మ్యాచ్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక మంది ప్రేక్షకులు హాజరైన రెండవ మ్యాచ్
మెల్బోర్న్లో భారత్, ఆసీస్ మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి ఐదు రోజుల్లో రికార్డుస్థాయిలో 3,51,100 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఓ టెస్టు మ్యాచ్‌కు ఇంతమంది రావడం ఇదే తొలిసారి. దీంతో 87 ఏళ్ల రికార్డు బ్రేక్ అయింది.
1936/37లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకుల సంఖ్యను నాలుగో టెస్టు దాటేసింది. 1937 జనవరిలో వేదికపై జరిగిన యాషెస్ టెస్టును వీక్షించేందుకు ఆరు రోజుల పాటు 3,50,534 మంది అభిమానులు రావడంతో ఈ రికార్డు గతంలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మ్యాచ్ ఆ రికార్డును అధిగమించింది. ఈ మ్యాచ్‌కు మొదటి మూడు రోజులు స్టేడియం నిండిపోయింది. నాలుగవ రోజు కేవలం 40,000 మంది మాత్రమే హాజరైనప్పటికీ, ఇవాళ మొదటి సెషన్లోనే 50వేల మందికి పైగా అభిమానులు హాజరయ్యారు.
అయితే, మొత్తంగా ఈ మ్యాచ్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక మంది ప్రేక్షకులు హాజరైన రెండవ మ్యాచ్‌గా నిలిచింది. 1999లో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన చారిత్రాత్మకమైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఈ జాబితాలో టాప్‌లో ఉంది. ఈ మ్యాచ్ కు ఐదు రోజులలో నమ్మశక్యం కాని విధంగా ఏకంగా 4,65,000 అటెండెన్స్ నమోదైంది.