Naga Chaitanya: ప్రధాని మోదీకి ధన్య‌వాదాలు తెలిపిన నాగచైత‌న్య దంప‌తులు

Naga Chaitanya and Sobhita Dhulipala Thanks to PM Narendra Modi
  • ఆదివారం నాడు మన్ కీ బాత్ నిర్వహించిన ప్రధాని మోదీ
  • అక్కినేని నాగేశ్వరరావుపై ప్ర‌శంస‌లు
  • మీ ప్ర‌శంస‌లు పొంద‌డం మా అదృష్ట‌మ‌న్న‌ చైతూ, శోభిత
  • ఇప్ప‌టికే మోదీకి థ్యాంక్స్ చెప్పిన హీరో నాగార్జున‌ 
ప్రధాని నరేంద్ర మోదీకి అక్కినేని నాగ చైత‌న్య‌, ఆయ‌న భార్య శోభిత ధూళిపాళ్ల ధ‌న్య‌వాదాలు తెలిపారు. దీనికి కార‌ణం ఆదివారం నాడు మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావును ప్ర‌శంసించ‌డ‌మే. తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు అని, ఆయన తన సినిమాల్లో భారతీయ విలువలు, సంప్రదాయాలను, సంస్కృతిని చక్కగా చూపించేవారని మోదీ కొనియాడారు. దీనిపై చైతూ, శోభిత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు క‌ళా నైపుణ్యాన్ని, తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ అభివృద్ధికి ఆయ‌న చేసిన సేవ‌ల‌ను మీరు అభినందించ‌డం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ప్ర‌శంస‌లు పొంద‌డం మా అదృష్టం. మీకు హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు అని చైతూ, శోభిత పోస్టులు పెట్టారు. 

కాగా, త‌న తండ్రిని ప్ర‌ధాని మోదీ ప్ర‌శంసించ‌డం ప‌ట్ల హీరో నాగార్జున కూడా కృత‌జ్ఞ‌తలు తెలుపుతూ ఇప్ప‌టికే పోస్ట్ చేశారు. "ఐకానిక్ దిగ్గజాల సరసన మా నాన్న గారిని కూడా గౌరవించినందుకు ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అది కూడా, మా నాన్న గారి శతజయంతి వేళ ఈ ప్రస్తావన తెచ్చినందుకు ధన్యవాదాలు. 

భారతీయ సినీ రంగం పట్ల ఆయన దూరదృష్టి, ఆయన అందించిన సేవలు అనేక తరాల వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ఇవాళ మీ ప్రత్యేక ప్రస్తావనతో మా కుటుంబానికి, మా నాన్న గారి నటనను ప్రేమించే అసంఖ్యాక అభిమానులకు అమిత సంతోషం కలిగింది" అని నాగార్జున త‌న పోస్టులో రాసుకొచ్చారు.  
Naga Chaitanya
Sobhita Dhulipala
Narendra Modi
ANR
Tollywood
Nagarjuna

More Telugu News