Yashasvi: బాక్సింగ్ డే టెస్ట్.. యశస్వి ఔట్ పై వివాదం.. వీడియో ఇదిగో!

Why Yashasvi Jaiswal was given out despite no spike on snicko
  • ఆస్ట్రేలియా ఆటగాళ్ల అప్పీల్ ను తోసిపుచ్చిన ఫీల్డ్ అంపైర్
  • వెంటనే డీఆర్ఎస్ కోరిన కెప్టెన్ కమిన్స్
  • స్నీకో మీటర్ లో స్పైక్స్ రాకున్నా ఔటిచ్చిన థర్డ్ అంపైర్
మెల్ బోర్న్ టెస్ట్ లో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. భారత బ్యాట్స్ మెన్ క్రీజ్ లో కుదురుకోలేక వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో 184 పరుగుల ఆధిక్యంతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ ఔట్ పై వివాదం రేగుతోంది. స్నికో మీటర్ లో ఎలాంటి స్పైక్స్ రాకున్నా థర్డ్ అంపైర్ ఔటివ్వడంపై చర్చ జరుగుతోంది. ఈ వివాదాస్పద నిర్ణయంతో నిలకడగా ఆడుతున్న జైస్వాల్ 84 పరుగుల వద్ద ఔటయి పెవిలియన్ కు చేరాడు. 

ఏం జరిగిందంటే..
సోమవారం జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 70 వ ఓవర్ వేశాడు. ఓవర్ చివరి బాల్ ను లెగ్ సైడ్ వైపు విసిరాడు. ఈ బంతిని ఆడేందుకు ప్రయత్నించి జైస్వాల్ విఫలమయ్యాడు. బంతి నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్లగా.. కమిన్స్ ఔట్ కు అప్పీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ తోసిపుచ్చడంతో వెంటనే డీఆర్ఎస్ కోరాడు. రీప్లేలో బంతి బ్యాట్ ను తాకలేదని కనిపిస్తూనే ఉంది, స్నీకో మీటర్ లోనూ ఎలాంటి స్పైక్స్ రాలేదు. అయినప్పటికీ థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చేశాడు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తంచేస్తూ జైస్వాల్ మైదానాన్ని వీడడం వీడియోలో కనిపించింది. ఇదే ఇప్పుడు విమర్శలకు దారితీసింది.
Yashasvi
Boxing Day Test
Australia
melbourne
Viral Videos

More Telugu News