Chiranjeevi: తండ్రి వర్ధంతికి చిరంజీవి నివాళి
- నేడు నటుడు చిరంజీవి తండ్రి వెంకట్రావు వర్ధంతి
- ఈ సందర్భంగా ఇంట్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన చిరు
- పాల్గొన్న తల్లి అంజనా దేవి, సోదరుడు నాగబాబు దంపతులు
- ఈ కార్యక్రమం తాలూకు ఫొటోలు, వీడియోను ఎక్స్ లో పంచుకున్న మెగాస్టార్
నేడు టాలీవుడ్ సీనియర్ నటుడు చిరంజీవి తండ్రి వెంకట్రావు వర్ధంతి. ఈ సందర్భంగా మెగాస్టార్ తన ఇంట్లో తండ్రికి నివాళి అర్పించారు. ఆయన పేరిట ప్రత్యేకంగా పూజలు చేయించారు. తన తల్లి అంజనా దేవి, భార్య సురేఖ, సోదరుడు నాగేంద్రబాబు దంపతులతో కలిసి చిరు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం తాలూకు ఫొటోలు, వీడియోను ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. "జన్మనిచ్చిన ఆ మహనీయుడ్ని ఆయన స్వర్గస్తులైన ఈ రోజున స్మరించుకుంటూ..." అంటూ చిరు ట్వీట్ చేశారు. అదే సమయంలో తన మామ అల్లు రామలింగయ్యకు కూడా చిరంజీవి నివాళులు అర్పించారు.
ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన 'బింబిసారా' ఫేం వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత మరో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలాతో సినిమా చేయనున్నారు. ఇటీవలే అధికారికంగా ఈ ప్రాజెక్టుపై ప్రకటన కూడా వచ్చింది. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇలా యువ హీరోలకు పోటీగా చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.