Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఎంతో పరిణతితో స్పందించారు: కస్తూరి

Kasturi responds on Pawan Kalyan comments about Allu Arjun issue

  • అల్లు అర్జున్ వివాదంపై పూర్తి స్థాయిలో స్పందించిన పవన్
  • పవన్ అంటే పెద్దరికం అంటూ కస్తూరి ట్వీట్
  • పక్షపాతం లేకుండా, కాంప్రమైజ్ కాకుండా స్పందించారని కితాబు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందడం, అల్లు అర్జున్ పై కేసు, అరెస్ట్ చేయడం, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయడం వంటి అంశాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు పూర్తిస్థాయిలో స్పందించారు. 

దీనిపై ప్రముఖ నటి కస్తూరి స్పందించారు. "పెద్దరికం అంటే పవన్. ఎంతో కచ్చితత్వంతో, పరిణతితో కూడిన ప్రకటన చేశారు. ఎక్కడా పక్షపాతం లేదు, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు" అంటూ కస్తూరి ట్వీట్ చేశారు. సంధ్య థియేటర్ విషాద ఘటనను గతానికి వదిలేసి 2025లోకి అడుగుపెడదాం అని కస్తూరి పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News