Vamsi: దీపను అలా చూసి అంతా షాక్ అయ్యారు: డైరెక్టర్ వంశీ

Vamsi Videos

  • 1986లో వచ్చిన 'లేడీస్ టైలర్'
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దీప 
  • ఆమె ఎంట్రీ గురించి ప్రస్తావించిన వంశీ 
  • ఆమె బరువు పెరగడం హాట్ టాపిక్ గా మారిందని వ్యాఖ్య     

తెలుగు తెరకి పరిచయమైన గ్లామరస్ హీరోయిన్స్ లో 'దీప' ఒకరు. 'అమెరికా అమ్మాయి' సినిమాతో తెలుగు తెరకి 'దీప' పరిచయమయ్యారు. 1980లలో కథానాయికగా ఆమె మరిన్ని విజయాలను అందుకున్నారు.  'పంతులమ్మ'... 'అక్బర్ సలీం అనార్కలి'... 'లేడీస్ టైలర్' సినిమాలు ఆమెకి మంచిపేరు తెచ్చిపెట్టాయి. 1986లో వచ్చిన 'లేడీస్ టైలర్' ఘన విజయాన్ని సాధించింది.

ఈ సినిమాలో వై విజయ... సంధ్యతో పాటు దీప కూడా 'డయా' అనే ముఖ్యమైన పాత్రను పోషించారు. ఆమెతో ఈ సినిమాకి మరింత ఆకర్షణ తోడవుతుందని భావించారు. దర్శకుడు వంశీ ఈ సినిమాకి సంబంధించిన తన వీడియోలో దీపను గురించి ప్రస్తావించారు. "తీయనున్న సీన్స్ గురించి ఆలోచన చేస్తూ ఉండగా కారు వచ్చి ఆగింది... కార్లో నుంచి దీప దిగింది. ఆమెను చూసి యూనిట్లోని జనాలు షాక్ అవుతూ 'దీప కాదు... పీపా" అంటూ గుసగుసలాడుకుంటున్నారు. 

'అదేంటండీ ఆమె అంత లావుగా ఉన్నారు.. మీరు వెళ్లి అడ్వాన్స్ ఇచ్చినప్పుడు సన్నగానే కదా ఉన్నారు' అని నిర్మాత అంటున్నారు. 'అప్పుడు మెరుపుతీగలా ఉన్నారు' అని సాయిబాబు గారు అన్నారు. 'దీపకి అభిమానిని కావడం వలన ఈవిడగారు దిగిపోతుందని తెలిసినప్పటి నుంచి అదోలా అయిపోయిన నేను, ఇప్పుడు ఏదోలా అయిపోతున్నాను' అన్నాడు తమ్ముడు సత్యం. దీప లావు సంగతి పక్కనపెట్టి షూటింగు మొదలుపెట్టాము. దీప బరువు పెరగడం సంగతిని అందరూ మరిచిపోయి ఎవరి పని వాళ్లు చేసుకోవడానికి కొన్ని రోజులు పట్టింది" అని చెప్పారు.

  • Loading...

More Telugu News