Raja Singh: 'కొత్త సంవత్సరం'పై వీడియో విడుదల చేసిన రాజాసింగ్... ఇదిగో వీడియో
- కొత్త ఏడాది పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆందోళన
- బ్రిటిష్ పాలకులు జనవరి 1ని మనపై రుద్ది వెళ్లారని ఆగ్రహం
- ఉగాది మన కొత్త సంవత్సరమని పిలుపునిచ్చిన రాజాసింగ్
కొత్త సంవత్సరం పేరుతో వివిధ ఈవెంట్స్ అంటూ చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరం పేరుతో గోవాకు, క్లబ్బులు, పబ్బులకు వెళ్లడం మంచిదేనా? ఇదేనా మన సంస్కృతి? అని ప్రశ్నించారు. జనవరి 1ని బ్రిటిష్ పాలకులు మనపై రుద్ది వెళ్లారని, దీంతో డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు ఈవెంట్స్ పేరుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు.
మనకు కొత్త సంవత్సరం జనవరి 1 కాదని, ఉగాది అని తెలిపారు. ఉగాది మన హిందువుల కొత్త సంవత్సరమని తెలిపారు. జనవరి 1న కొత్త సంవత్సరం పేరుతో మన భవిష్యత్తు తరాలకు విదేశీ సంస్కృతిని అలవాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు వేడుకల పేరుతో హిందువులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారన్నారు. ఉగాది మన కొత్త సంవత్సరం అని మన భవిష్యత్తు తరాలకు చెబుదామని పిలుపునిచ్చారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి 1 మన కొత్త సంవత్సరం కాదన్నారు.