KCR: కొత్త ఏడాదిలో ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు వస్తేనే పురోగతి: కేసీఆర్
- ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్
- 2025లో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించిన కేసీఆర్
- మంచి, చెడులను, కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని వ్యాఖ్య
కొత్త ఏడాదిలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని, ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. 2025 కొత్త ఏడాది సందర్భంగా ఆయన తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ ప్రకటనను విడుదల చేశారు.
అదే సమయంలో పురోగతి దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు. 2025 సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. కాలప్రవాహంలో వచ్చే మంచి చెడులను, కష్ట సుఖాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను అలవర్చుకుంటూ ఆశావహ దృక్పథంతో జీవితాలను చక్కదిద్దుకోవాలన్నారు.