New Year 2025: నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలోనూ సుఖ సంతోషాలు నింపాలి: లోకేశ్
నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలోనూ సుఖ సంతోషాలు తీసుకురావాలని ఏపీ విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. ఈ మేరకు అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. విధ్వంస, నియంతృత్వ పాలనను ప్రజలు గతేడాది తరిమికొట్టి ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించుకున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. ఎన్నో ఆశలు, ఆనందాలు, సంతోషాలను మోసుకు వస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.