IPS: పదవీ విరమణ చేసిన ఏపీ సీనియర్ ఐపీఎస్లకు సత్కారం
- డీజీపీ కార్యాలయంలో పదవీ విరమణ ఐపీఎస్లకు వీడ్కోలు సత్కారం
- అంజనా సిన్హా, వెంకట్రామిరెడ్డిలు అందించిన సేవలను ప్రశంసించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు
- వీరు అందించిన సేవలు చిరస్మరణీయంగా గుర్తు ఉండిపోతాయన్న డీజీపీ
ఏపీ పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ చేసిన డీజీ ర్యాంకు అధికారిణి అంజనా సిన్హా, ఐజీ వెంకట్రామిరెడ్డిలను డీజీపీ ద్వారాకా తిరుమలరావు సన్మానించారు. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో మంగళవారం డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. వీరు అందించిన సేవలు చిరస్మరణీయంగా గుర్తుండిపోతాయన్నారు. ఎన్నో త్యాగాలు చేసి సుదీర్ఘ కాలం పోలీస్ శాఖకు వెలకట్టలేని సేవలందించిన వారికి, వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. వారి శేష జీవితం మంచి ఆరోగ్యంతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు డీజీలు, అడిషినల్ డీజీపీలు, ఐజీపీలు, డీఐజీలు పాల్గొన్నారు.