Gen Beta: తరం మారింది.. కొత్త ఏడాదిలో కొత్త తరం ‘జెన్ బీటా’
- మరింత ప్రత్యేకంగా 2025 సంవత్సరం
- 22వ శతాబ్దాన్ని చూసే తరం వచ్చేసింది
- ప్రతీ పదిహేనేళ్లకు కొత్త తరంగా లెక్కింపు
కొత్త ఏడాది వచ్చేసింది.. ప్రపంచమంతా సంబరాలు జరుపుకున్నది. మిగతా సందర్భాలతో పోలిస్తే ఈ ఏడాది మరింత స్పెషల్ గా నిలవనుంది. ఎందుకంటే 2025లో తరం మారింది, కొత్త తరానికి స్వాగతం పలికిందీ సంవత్సరం. ఈ ఏడాది నుంచి 2039 వరకు పుట్టిన వారు ‘జెన్ బీటా’ తరానికి చెందిన వారు. 21 వ శతాబ్దానికి గుడ్ బై చెప్పి 22 వ శతాబ్దానికి స్వాగతం పలికే తరమిది. 2035 నాటికి ప్రపంచ జనాభాలో 16 శాతం జెన్ బీటా తరం పిల్లలే ఉంటారని అంచనా. కృత్రిమ మేధ ప్రపంచాన్ని ఏలే రోజులకు ఈ తరం సాక్ష్యంగా నిలవబోతోంది. వీరి జీవితాలలో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషించనుందని నిపుణులు చెబుతున్నారు. మిగతా తరాలతో పోలిస్తే జెన్ బీటా తరం పూర్తిగా అడ్వాన్స్డ్ గా ఉంటుందని వివరించారు. ఈ తరంలో మిలీనియల్స్ తరంలో చిన్న వారికి పుట్టే పిల్లలు, జెన్ జెడ్ తరంలో పెద్ద వారికి పుట్టే పిల్లలు ఉంటారు. కాగా, ప్రతీ పదిహేనేళ్లకు ఓ కొత్త తరంగా నిపుణులు లెక్కిస్తున్నారు.
ఈ లెక్కన ఎప్పుడు ఏ తరం..
2013 నుంచి 2024 మధ్య కాలంలో పుట్టిన వారు జనరేషన్ ఆల్ఫా (జెన్ ఆల్ఫా)
1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారు జనరేషన్ జడ్ (జెన్ జెడ్)
1981 నుంచి 1996 మధ్య జన్మించిన వారు మిలీనియల్స్
1980 నుంచి 1965 మధ్య పుట్టిన వారు జనరేషన్ ఎక్స్ (జెన్ ఎక్స్)
1946 నుంచి 1964 మధ్య జన్మించిన వారు బేబీ బూమర్స్
1928 నుంచి 1945 తరం సైలెంట్ జనరేషన్
1922 నుంచి 1927 తరం గ్రేటెస్ట్ జనరేషన్