Megastar: విశ్వంభర సెట్స్ నుంచి మెగాస్టార్ న్యూఇయర్ సందేశం ఇదే..!

Megastar Chiranjeevi New Year Message

--


కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్న మెగాస్టార్.. కొత్త ఏడాది మరింత ప్రకాశవంతంగా విస్తరించాలని, కొత్త ఆశలు, ఆకాంక్షలు సాకారం చేసుకునే శక్తిని అందివ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కోట్లాదిమంది అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ.. కొత్త సంవత్సరమంతా ప్రేమతో కలిసిమెలిసి ఉంటూ అందరితో ఆనందాన్ని పంచుకోవాలని సూచించారు.

‘బై బై 2024, వెల్కం 2025.. కొత్త ఆశలు, ఆకాంక్షలు, కెరీర్ లక్ష్యాలను సాధించేందుకు ఈ కొత్త సంవత్సరం శక్తినివ్వాలి. భారతీయ సినిమా వైభవం మరింత ప్రకాశవంతంగా విస్తరించాలి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అంటూ సోషల్ మీడియాలో చిరంజీవి పోస్ట్ చేశారు. 

  • Loading...

More Telugu News