Chandrababu: ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన సీఎం చంద్రబాబు... స్వాగతం పలికిన పార్టీ నేతలు, కార్యకర్తలు

Party cadre welcomed CM Chandrababu at TDP Head Office in Mangalagiri

  • నేడు నూతన సంవత్సరాది
  • చంద్రబాబును ఉండవల్లి నివాసంలో కలిసిన మంత్రులు, అధికారులు
  • రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
  • అనంతరం మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యాలయానికి రాక
  • చంద్రబాబు రాకతో సందడిగా మారిన పార్టీ కేంద్ర కార్యాలయం

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు విచ్చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. నూతన సంవత్సరాది రోజున పార్టీ అధినేత రాకతో ఎన్టీఆర్ భవన్ లో భారీ కోలాహలం నెలకొంది. చంద్రబాబుకు నేతలు, కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

అంతకుముందు, చంద్రబాబు నివాసానికి మంత్రులు, ఉన్నతాధికారులు వెళ్లి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత చంద్రబాబు విజయవాడలో రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. 

ఆ తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. చంద్రబాబు వస్తారని తెలియడంతో, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంగళగిరి తరలివచ్చారు.

  • Loading...

More Telugu News