New Year 2025: న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా విడుద‌లైన‌ టాలీవుడ్‌ కొత్త‌ సినిమాల పోస్టర్లు ఇవిగో!

New Posters form Tollywood New Movies on New Year

   


న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా సినీ ప్రేమికుల‌కు వ‌రుస గిఫ్టులు వ‌స్తున్నాయి. ఈరోజు ప‌లు తెలుగు కొత్త సినిమాల పోస్ట‌ర్లు విడుద‌లయ్యాయి. వీటిలో నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన 'హిట్-3', సిద్దు జొన్న‌ల గ‌డ్డ హీరోగా వ‌స్తున్న 'జాక్‌', 'తెలుసు క‌దా', రామ్ పోతినేని 22వ చిత్రం, సుహాస్‌ కొత్త చిత్రం' ఓ భామ అయ్యో రామా', యాంక‌ర్‌ ప్ర‌దీప్ 'అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి', కిర‌ణ్ అబ్బ‌వ‌రం 'దిల్‌రుబా', 'ఆర్‌సీ16' త‌దిత‌ర చిత్రాల పోస్ట‌ర్లు ఉన్నాయి. 

ఇక గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, శంక‌ర్ కాంబోలో వ‌స్తున్న 'గేమ్ ఛేంజ‌ర్' ట్రైల‌ర్ విడుద‌ల‌పై అప్‌డేట్ ఇచ్చిన మేక‌ర్స్ ఓ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఇలా ఇవాళ నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్లు సందడి చేస్తున్నాయి. ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా టాలీవుడ్ కొత్త సినిమాల పోస్ట‌ర్ల‌పై ఓ లుక్కేయండి. 

  • Loading...

More Telugu News