Perni Jayasudha: మచిలీపట్నం పీఎస్ లో విచారణకు హాజరైన పేర్ని జయసుధ

Perni Jayasudha attends enquiry at Machilipatnam Police Station
  • రేషన్ బియ్యం మాయం కేసులో ఏ1గా పేర్ని జయసుధ
  • నిన్న నోటీసులు ఇచ్చిన పోలీసులు
  • ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి విచారణ
  • తన న్యాయవాదులతో కలిసి పీఎస్ కు వచ్చిన పేర్ని నాని అర్ధాంగి
రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని అర్ధాంగి పేర్ని జయసుధ నేడు మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. పేర్ని జయసుధ పేరిట ఉన్న గోడౌన్ నుంచి 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్టు అధికారులు గుర్తించారు. 

ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని జయసుధకు నిన్న నోటీసులు జారీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరవ్వాలని పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలో, పేర్ని జయసుధ మచిలీపట్నం మేయర్ కారులో తన న్యాయవాదులతో కలిసి పీఎస్ కు వచ్చారు. అయితే విచారణకు ఆమె తరఫు న్యాయవాదులను పోలీసులు అనుమతించలేదు. ప్రస్తుతం పేర్ని జయసుధను ఆర్.పేట సీఐ ఏసుబాబు విచారిస్తున్నారు.
Perni Jayasudha
Enquiry
Ration Rice
Machilipatnam
Perni Nani
YSRCP

More Telugu News