Nitish kumar Reddy: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌ విడుదల... నితీశ్ కుమార్ రెడ్డి ఏ స్థానంలో నిలిచాడంటే?

Nitish kumar Reddy jumped 20 places up to the 53rd position latest ICC Test batting rankings

  • టాప్-4లో నిలిచిన యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్
  • ఐసీసీ టాప్-10 బ్యాటర్లలో చోటు దక్కిన ఏకైక భారత ఆటగాడిగా నిలిచిన ఓపెనర్
  • కెరీర్ బెస్ట్ 53వ ర్యాంకు సాధించిన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి
  • టాప్-10 భారత బ్యాటర్లలో యువ కెరటానికి చోటు
  • ఏకంగా 40వ స్థానానికి దిగజారిన రోహిత్ శర్మ

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. 528 రేటింగ్ పాయింట్లతో 20 స్థానాలు ఎగబాకి 53వ స్థానానికి చేరుకున్నాడు. అరంగేట్ర సిరీస్‌లోనే ఆకట్టుకుంటున్న ఈ యువ ఆల్‌రౌండర్ టాప్-10 భారత బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో శతకాన్ని సాధించిన నితీశ్ అందరి ప్రశంసలు అందుకున్నాడు. టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సంచలనం సృష్టించాడు.

దిగజారిన రోహిత్, కోహ్లీ ర్యాంకులు
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత అగ్రశ్రేణి క్రికెటర్ల ర్యాంకులు భారీగా దిగజారాయి. ఐసీసీ టాప్-10 ర్యాంకుల్లో భారత్ నుంచి యశస్వి జైస్వాల్ మాత్రమే నిలిచాడు. బాక్సింగ్ డే టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 80 ప్లస్ పరుగులు సాధించిన ఈ యువ ఆటగాడు  4వ స్థానంలో నిలిచాడు. జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి మినహా మిగతా బ్యాటర్లు అందరి స్థానాలు భారీగా దిగజారాయి.

ఆసీస్ పర్యటనలో 5 ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 31 పరుగులు సాధించిన కెప్టెన్ రోహిత్ శర్మ 40వ ర్యాంక్‌కు పడిపోయాడు. విరాట్ కోహ్లీ మూడు స్థానాలు దిగజారి 24వ స్థానానికి పతనమయ్యాడు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ కూడా ఒక్కో స్థానం దిగజారారు.

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారతీయ బ్యాటర్ల స్థానాలు
యశస్వి జైస్వాల్ - 4
రిషబ్ పంత్ -12 
శుభ్‌మాన్ గిల్ - 20
విరాట్ కోహ్లీ - 24
రోహిత్ శర్మ - 40
కేఎల్ రాహుల్ - 41
రవీంద్ర జడేజా - 50
నితీశ్ కుమార్ రెడ్డి - 53
శ్రేయాస్ అయ్యర్ - 68
అక్షర్ పటేల్ - 69

  • Loading...

More Telugu News