Chandrababu: నూతన సంవత్సరం తొలిరోజున 2 వేల మందిని కలిసిన సీఎం చంద్రబాబు

CM Chandrababu met 2 thousand people on new year eve

  • సంవత్సరాది రోజున వేడుకలకు దూరంగా సీఎం చంద్రబాబు
  • ప్రజలకు చేరువగా గడిపిన వైనం
  • పేదలకు ఉపయోగపడే సీఎంఆర్ఎఫ్ నిధుల ఫైల్ పై సంతకం

ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేడు నూతన సంవత్సరాది సందర్భంగా వేడుకలకు దూరంగా, ప్రజలకు చేరువగా గడిపారు.,600 మంది పేదలకు రూ.24 కోట్లు విడుదల చేసే సీఎంఆర్ఎఫ్ ఫైల్ పై సంతకంతో నూతన సంవత్సరం మొదటి రోజును ప్రారంభించారు. అనంతరం, ఉదయం 10.45 గంటలకు టీటీడీ అర్చకులతో ఆశీర్వాదం తీసుకున్నారు. 

ఉదయం 11 గంటల నుంచి తన నివాసంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వివిధ శాఖల అధికారులను కలిశారు. మధ్యాహ్నం 12.20 గంటల తర్వాత విజయవాడ దుర్గగుడిలో అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ్నించి మధ్యాహ్నం 1.30 గంటలకు గవర్నర్ వద్దకు వెళ్లి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. 

మధ్యాహ్నం 2.30 గంటల తరువాత మీడియా ప్రతినిధులతో పలు అంశాలపై చిట్ చాట్ నిర్వహించారు. అనంతరం 3.15 గంటల తర్వాత పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు దాదాపు 1500 మందితో పార్టీ కార్యాలయంలో ఫోటోలు దిగారు. తనను కలిసిన ప్రతి ఒక్కరి నుంచి విషెస్ స్వీకరించారు. 

ఇక, సాయంత్రం 6 గంటల తర్వాత సచివాలయానికి వెళ్లారు. అక్కడ సీఎంవో అధికారులతో సమావేశమయ్యారు. సచివాలయం మొదటి బ్లాక్ లో ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులతో గంటపాటు సమావేశయ్యారు. తన ఆలోచనలు చెప్పి....వారి సూచనలు తీసుకున్నారు. 

రాత్రి గం. 7.15 తర్వాత... రేపటి క్యాబినెట్ అజెండాపై సీఎంవో అధికారులతో చర్చించి... మరి కొంత మంది నాయకులను సచివాలయంలోనే కలిశారు. అనంతరం ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. 

కాగా, రేపు (జనవరి 2) సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలకు అనుమతులు ఇచ్చే విషయమై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News