Telangana: రేపు సావిత్రిబాయి పూలే జయంతి... తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

TG government announced women teachers day on savitribai phule
  • సావిత్రిబాయి పూలే జయంతి రోజును మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటన
  • ప్రతి ఏటా జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవం 
  • జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆ రోజున మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి సంవత్సరం జనవరి 3న 'మహిళా ఉపాధ్యాయ దినోత్సవం' నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించడంపై తెలంగాణ ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ హర్షం వ్యక్తం చేసింది.
Telangana
Teachers Day
Congress

More Telugu News