Shubman Gill: స్టీవ్ స్మిత్ స్లెడ్జింగ్‌.. ఆ త‌ర్వాతి బంతికే వికెట్ పారేసుకున్న గిల్‌.. వైర‌ల్ వీడియో!

Steve Smith Sledges Shubman Gill India Star Loses Wicket Next Ball

    


సిడ్నీ వేదిక‌గా జ‌రుగుతున్న ఆఖ‌రిదైన ఐదో టెస్టులో భార‌త బ్యాట‌ర్లు మ‌రోసారి చెతులెత్తేశారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగుల స్వ‌ల్ప స్కోర్‌కే చాప‌చుట్టేసింది. అయితే, భార‌త జ‌ట్టు ఆట‌గాడు శుభ్‌మ‌న్ గిల్ ఆవేశానికి పోయి వికెట్ పారేసుకోవ‌డంతో విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాడు. ఆసీస్ ప్లేయ‌ర్ స్టీవ్ స్మిత్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ గిల్‌పై క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగాడు. 

నాథ‌న్ లైయ‌న్ బౌలింగ్‌లో గిల్‌పై స్లెడ్జింగ్‌కి పాల్ప‌డ్డాడు. ల‌బుషేన్‌, లైయ‌న్‌తో క‌లిసి భార‌త బ్యాట‌ర్ దృష్టిని మ‌ర‌లించాడు స్మిత్. అంతే.. మ‌నోడు ఆ త‌ర్వాతి బంతికే క్రీజు వ‌దిలి ముందుకొచ్చి ఆడాడు. దాంతో బాల్.. బ్యాట్ ఎడ్జ్ తీసుకుని నేరుగా స్లిప్‌లో ఉన్న స్మిత్ చేతుల్లోకి వెళ్లిపోయింది. గిల్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను అందుకున్న స్మిత్ తోటి ఆట‌గాళ్ల‌తో క‌లిసి సంబరాలు చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News