Sydney Test: సిడ్నీ టెస్టులో ముగిసిన తొలి రోజు ఆట.. ఆసీస్ స్కోర్ ఎంతంటే?

day 1 of India vs Australia 5th test concluded in Sydney

  • ఆట ముగిసే సమయానికి ఆసీస్ స్కోర్ 9/1
  • ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను పెవిలియన్‌కు పంపించిన బుమ్రా
  • తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే ఆలౌట్ అయిన భారత్ 
  • మరోసారి దారుణంగా విఫలమైన బ్యాటర్లు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరిదైనా ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట పూర్తయింది. ముగింపు సమయానికి ఆతిథ్య ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి 9 పరుగులు చేసింది. 2 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఔట్ చేశాడు. ఆసీస్ ఫస్ట్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ చివరి బంతికి కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అతడు ఔట్ అయ్యాడు. ఆ ఓవర్‌తో తొలి రోజు ఆట ముగిసింది. 7 పరుగులు చేసిన సామ్ కొన్‌స్టాస్ క్రీజులో ఉన్నాడు.

అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌట్ కావడంతో ఆసీస్ ప్రస్తుతం 176 పరుగులు వెనుకబడి ఉంది. కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 185 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. 40 ప‌రుగులు చేసిన వికెట్ కీపర్ రిష‌భ్ పంత్ టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. గిల్ 20, ర‌వీంద్ర జ‌డేజా 26, కెప్టెన్ జ‌స్ప్రీత్ బుమ్రా 22, కేఎల్ రాహుల్ 4, య‌శ‌స్వి జైస్వాల్ 10 స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఇక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 17 పరుగులు చేయగా... గత మ్యాచ్‌లో సెంచరీ హీరో నితీశ్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆసీస్ బౌల‌ర్లలో స్కాట్ బొలాండ్ అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్ 3, ప్యాట్ క‌మిన్స్ 2, నాథ‌న్ లైయ‌న్ 1 వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News