offbeat: నో సెల్ఫీ ప్లీజ్... యువకుడికి సింహం సిగ్నల్... వైరల్ వీడియో ఇదిగో!

Lion politely insists visitors obey the rules

  • సింహంతో సెల్ఫీ దిగాలని ముచ్చటపడిన యువకుడు
  • ఫెన్సింగ్‌ నుంచి చేయి లోపలికి పెట్టి ఫోన్‌ లో సెల్ఫీ తీసేందుకు ప్రయత్నం
  • దగ్గరికి వచ్చి చేతిని తడుతూ వారించిన సింహం!
  • సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారిన వీడియో

సింహంతో సెల్ఫీ అంటే మామూలు విషయం కాదు. బయటే కాదు జూలో అయినా... సింహంతో ఫొటో దిగాలన్న ముచ్చట లేనివారెవరూ ఉండరు. కానీ సింహమే నేరుగా దగ్గరికి వచ్చి... ‘నో సెల్ఫీ ప్లీజ్‌’ అంటే! గుండెలు అదిరిపోయినట్టే. కానీ సింహం అలా దగ్గరికి వచ్చి చెబుతుందా? ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. నిజంగానే సింహం దగ్గరికి వచ్చి ఫొటో వద్దు బాబూ అన్నట్టుగా వారించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

  • సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో తాజాగా ఈ సింహం వీడియో పోస్ట్‌ అయింది. దీనికి కేవలం ఒక్కరోజులోనే 8 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి.
  • ‘సింహం చాలా మర్యాదగా చెప్పింది. అడవిలో ఉన్నా, జూలో ఉన్నా రాజు రాజే’ అనే కామెంట్లు పడుతున్నాయి.
  • మరోవైపు... ‘ఇంకా నయం.. ఆ చేతిని కసుక్కున కొరికేయలేదు. ఏమైనా సింహంతో ఆటలు డేంజరే..’’ అని మరికొందరు పేర్కొంటున్నారు.
  • ‘బాబూ చేయి బయటికి తీసుకో.. అన్ని సింహాలూ నా అంత మంచివి కావు’ అన్నట్టుగా సింహం తీరు ఉందని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News