North India: మంచు తెరల చాటున ఉత్తర భారతం.. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం

255 flights delayed 43 cancelled 15 diverted at Delhi airport due to fog shrouds north India
  • ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్న విపరీతమైన చలి, పొగమంచు
  • కనిష్ఠ స్థాయికి పడిపోయిన విజిబిలిటీ
  • ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పెద్ద సంఖ్యలో విమానాల రద్దు
  • కొన్ని ఫ్లైట్స్‌ను దారి మళ్లిస్తున్న ఎయిర్‌లైన్స్
  • రైలు సర్వీసులపైనా పొగమంచు ప్రభావం
గత రెండు రోజులుగా మంచు తెరల చాటున ఉన్న ఉత్తర భారతదేశంలో పరిస్థితులు అదే విధంగా కొనసాగుతున్నాయి. ఇవాళ (శనివారం) కూడా తీవ్రమైన చలితో పాటు దట్టమైన పొగమంచు కురుస్తోంది. శనివారం ఉదయం విజిబిలిటీ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. రెండు మూడు మీటర్ల దూరం కూడా స్పష్టంగా కనిపించే పరిస్థితి లేదు. దీంతో ఉత్తర భారత రాష్ట్రాలలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది.

ఎయిర్‌పోర్టులో రన్‌వేపై విజిబిలిటి మూడు మీటర్ల కంటే ఎక్కువ లేకపోవడంతో వందలాది విమాన సర్వీసులు రద్దవుతున్నాయి. ఈ అనివార్య పరిస్థితుల్లో ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరాల్సిన విమానాలను ఎయిర్‌లైన్స్ సంస్థలు పెద్ద సంఖ్యలో తాత్కాలికంగా రద్దు చేస్తున్నాయి. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నాయి. రాత్రి 12.15 గంటల నుంచి 1.30 గంటల సమయంలో 15 విమానాలను వేరే విమానాశ్రయాలకు పంపించాల్సి వచ్చింది. రాత్రి నుంచి ఉదయం వరకు దాదాపు 43 సర్వీసులు రద్దయ్యాయి. 255 ఫ్లైట్స్ ఆలస్యమయ్యాయి. దీనిని బట్టి అక్కడ పొగమంచు ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఉత్తర భారతదేశంలో శుక్రవారం నుంచి ఇవే పరిస్థితులు కొనసాగుతున్నాయి. మూడు రోజుల్లో 400లకు పైగా ఫ్లైట్స్ ఆలస్యమయ్యాయి. రైలు సర్వీసుల విషయంలో కూడా ఇవే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విజిబిలిటీ సరిగా లేకపోవడంతో ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
North India
Delhi
Flights
Trains

More Telugu News