Klinkaara: స్క్రీన్‌పై తండ్రిని మొద‌టిసారి చూసి క్లీంకార ఏం చేసిందో మీరే చూడండి... క్యూట్ వీడియో షేర్ చేసిన ఉపాస‌న‌

Klinkaara Excited to See Her Naana on TV for the First Time Cute Video goes Viral
   
రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న దంపతుల ముద్దుల త‌న‌య‌, మెగా ప్రిన్సెస్ క్లీంకార కొత్త వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది. 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా త‌ల్లి ఉపాస‌న ఈ వీడియోను షేర్ చేశారు. "క్లీంకార త‌న నాన్న‌ను మొద‌టిసారిగా స్క్రీన్‌పై చూస్తోంది" అంటూ ఆమె ఈ వీడియోను పంచుకున్నారు. 

'ఆర్ఆర్ఆర్' మేకింగ్ వీడియోను ఉపాస‌న ప్ర‌ద‌ర్శించ‌గా అందులో రామ్ చ‌ర‌ణ్‌ను చూసి క్లీంకార ఆనందంతో కేక‌లు వేయ‌డం వీడియోలో ఉంది. ఈ వీడియోను మెగా అభిమానులు షేర్ చేస్తుండ‌టంతో వైర‌ల్ అవుతోంది. కాగా, ఈ నెల 10న విడుద‌ల‌య్యే చెర్రీ త‌దుప‌రి సినిమా 'గేమ్ ఛేంజ‌ర్'కు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఉపాస‌న పోస్ట్ చేశారు.  
Klinkaara
Ramcharan
Upasana Kamineni Konidela
Tollywood

More Telugu News