Vaikunta Dwara Darshanam: ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు: భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి

TTD Chairman BR Naidu appeal for devotees

  • తిరుమలలో జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు
  • 10, 11, 12 తేదీల్లోనే దర్శించుకోవాలని అనుకోవద్దన్న బీఆర్ నాయుడు
  • ఈ నెల 19 వరకు ఎప్పుడైనా దర్శించుకోవచ్చని సూచన

త్వరలో తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్న నేపథ్యంలో, భక్తులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక విజ్ఞప్తి చేశారు. జనవరి 10 నుంచి 19 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని... జనవరి 10, 11, 12 తేదీల్లోనే స్వామివారిని దర్శించుకోవాలని అనుకోకండి అని పేర్కొన్నారు. 

టోకెన్లు తీసుకోవాలన్న ఆత్రుతలో తోసుకోవద్దని సూచించారు. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని, ఈ నెల 19 లోపు ఎప్పుడైనా శ్రీవారిని దర్శించుకోవచ్చని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.

వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ చేయనున్న కేంద్రాల్లో ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయని, ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష చేపడుతున్నానని వివరించారు. టీటీడీ ఈవో శ్యామలరావుతో ఏర్పాట్లపై చర్చించానని వెల్లడించారు. సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. సామాన్య భక్తులకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నామని, వీఐపీలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడంలేదని తెలిపారు.

  • Loading...

More Telugu News