Game Changer: గేమ్ చేంజర్ టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి

AP Govt gives nod to hike ticket prices for Game Changer movie
  • రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా గేమ్ చేంజర్
  • శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రం
  • జనవరి 10న గ్రాండ్ రిలీజ్
  • విడుదల రోజున ఆరు షోలు
  • బెనిఫిట్ షో టికెట్ రూ.600... అనుమతిచ్చిన ఏపీ సర్కారు
  • మల్టీప్లెక్స్ లో రూ.175, సింగిల్ స్క్రీన్ పై రూ.135 వరకు పెంపు
  • ఇవే ధరలతో జనవరి 11 నుంచి 23 వరకు రోజుకు ఐదు షోలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో, గేమ్ చేంజర్ టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

బెనిఫిట్ షో టికెట్ రూ.600 చొప్పున విక్రయించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంటకు గేమ్ చేంజర్ బెనిఫిట్ షోలు వేయనున్నారు. ఈ నెల 10న ఆరు షోలకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ పై అదనంగా రూ.175, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ పై అదనంగా రూ.135 వరకు పెంచుకోవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇవే ధరలతో జనవరి 11 నుంచి 23 వరకు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది
Game Changer
Ticket Prices
AP Govt
Ram Charan
Shankar
Dil Raju
Andhra Pradesh

More Telugu News