Revanth Reddy: గ్రూప్-1పై కుట్రలన్నీ ఛేదించి పరీక్షలు నిర్వహించాం: సీఎం రేవంత్ రెడ్డి
- ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రేవంత్ రెడ్డి
- ఏడాది కాలంలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి
- దేశంలోనే ఇదొక రికార్డు అని స్పష్టీకరణ
తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏడాది కాలంలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. ఇది దేశంలోనే రికార్డు అని పేర్కొన్నారు. పదేళ్లుగా పేరుకుపోయిన ఉద్యోగాలు ఇప్పుడు ఇస్తున్నామని తెలిపారు.
గత 14 ఏళ్లలో గ్రూప్-1 నియామకాలు చేపట్టలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో ఎన్నడూ ఒకేసారి 563 గ్రూప్-1 ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. తాము గ్రూప్-1పై కుట్రలన్నీ ఛేదించి పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. మార్చి 31 లోపు గ్రూప్-1 నియామకాలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
ఇక, తెలంగాణ క్యాడర్ అధికారులు కేంద్రంలో ఉన్నా... రాష్ట్రం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.