Fire Accident: హైదరాబాద్ మినర్వా హోటల్ లో భారీ అగ్నిప్రమాదం
- హిమాయత్ నగర్ లో ఉన్న మినర్వా హోటల్ లో అగ్నిప్రమాదం
- కిచెన్ లో ఎగసిపడిన మంటలు
- పరుగులు తీసిన కస్టమర్లు, హోటల్ సిబ్బంది
హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని మినర్వా హోటల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కిచెన్ లో మొదలైన మంటలు వేగంగా వ్యాపించడంతో కస్టమర్లు, హోటల్ సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. హోటల్ నుంచి బయటికి పరుగులు తీశారు.
అగ్నిప్రమాదం కారణంగా హోటల్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలముకుంది. దాంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్ మెంట్ సిబ్బంది మంటలు ఆర్పివేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
రాత్రి 8 గంటల సమయంలో మొదలైన మంటలు ఇప్పటికీ అదుపులోకి రాలేదని తెలుస్తోంది. నారాయణగూడ పోలీసులు ఈ ఘటనకు కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.