Cooking Oils: ఇంట్లో వాడే నూనెతో యువకుల్లోనూ పెద్దపేగు క్యాన్సర్!

Cancer with edible oils warns American surgeon general Vivek Murthy
  • మద్యంతోనూ ఏడు రకాల క్యాన్సర్లు
  • తాజా అధ్యయనంలో గుర్తింపు
  • అమెరికా సర్జన్ జనరల్ వివేక్‌మూర్తి వెల్లడి
ఇళ్లు, హోటళ్లలో వాడే సన్‌ఫ్లవర్ నూనె, ద్రాక్ష గింజల నూనె, కనోలా, మొక్కజొన్నల నూనెలతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైనట్టు అమెరికా సర్జన్ జనరల్ వివేక్‌మూర్తి తెలిపారు. యువకుల్లో పెద్దపేగు తరహా క్యాన్సర్ పెరుగుదలకు ఈ వంట నూనెలే కారణమని అధ్యయనంలో తేలినట్టు పేర్కొన్నారు. అధ్యయనంలో భాగంగా 30 నుంచి 85 ఏళ్ల మధ్య వయసున్న 80 మంది పెద్దపేగు క్యాన్సర్ రోగుల కణతులను పరిశీలించిప్పుడు ఈ విషయం అర్థమైనట్టు చెప్పారు. వాటిలో బయోయాక్టివ్ లిపిడ్లు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు గుర్తించామన్నారు. విత్తనాల నుంచి వచ్చే నూనెల వాడకం వల్ల ఇవి పెరుగుతున్నాయని వివేక్ మూర్తి వివరించారు. 

అలాగే, మద్యంతో ఏడు రకాల క్యాన్సర్లు పొంచి ఉన్నాయని వివేక్‌మూర్తి తెలిపారు. ఈ నేపథ్యంలో మద్యం బాటిళ్లపై హెచ్చరికలతో కూడిన లేబుళ్లు వేసి ప్రజలకు అవగాహన కల్పించాలని అమెరికా కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు. పొగాకు, ఊబకాయం తర్వాత క్యాన్సర్‌కు మూడో అతి పెద్ద కారణం మద్యమేనని స్పష్టం చేశారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రొమ్ము, కాలేయం, పెద్దపేగు, అన్నవాహిక, గొంతు సహా ఏడు రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. శాస్త్రీయ పరిశోధనల్లోనూ ఇది నిర్ధారణ అయిందని పేర్కొన్నారు.
Cooking Oils
Liquor
CAncers
Colon Cancer
Surgeon General Vivek Murthy

More Telugu News