Ambati Rambabu: 'పుష్ప'కేమో నీతులు.. 'గేమ్ చేంజర్'కు పాటించరా!: అంబటి రాంబాబు
'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లొస్తూ మరణించిన అభిమానులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హీరో రామ్ చరణ్ పరిహారం ప్రకటించడంపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పరోక్ష విమర్శలకు దిగారు. ఈ మేరకు ఆయన " 'పుష్ప'కేమో నీతులు చెప్తారా.. 'గేమ్ చేంజర్'కు పాటించరా!" అని పవన్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
కాగా, శనివారం నాడు రాజమహేంద్రవరంలో జరిగిన 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దాంతో మృతుల కుటుంబాలకు బాబాయి, అబ్బాయి పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్, చెర్రీ చెరో రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.