HMPV Virus: హెచ్ఎంపీవీ కేసులు... అధికారులకు ఢిల్లీ మంత్రి కీలక ఆదేశాలు

Delhi mandates isolation directs hospitals to report suspected HMPV cases
  • వైరస్ వ్యాప్తి చెందితే తీసుకోవాల్సిన చర్యలపై అప్రమత్తంగా ఉండాలని ఆసుపత్రులకు ఆదేశాలు
  • కేంద్ర ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరపాలని ఢిల్లీ ఆరోగ్య శాఖకు ఆదేశం
  • వైరస్ విషయంలో ఆదేశాలు, సూచనల కోసం ఫోన్లో సంప్రదించవచ్చునని సూచన
దేశంలోని రెండు రాష్ట్రాల్లో హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో రెండు, గుజరాత్‌లో ఒకటి నమోదైంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. హెచ్‌ఎంపీవీ విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆదేశాలు జారీ చేశారు.

ఒకవేళ హెచ్ఎంపీవీ వ్యాప్తి చెందితే తీసుకోవాల్సిన చర్యలపై అన్ని ఆసుపత్రులు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి భరద్వాజ్ సూచించారు. ఈ వైరస్ కట్టడికి సంబంధించిన అంశాలపై ఢిల్లీ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరపాలన్నారు.

ఈ హెచ్ఎంపీవీ వైరస్‌కు సంబంధించి ఎలాంటి ఎలాంటి కొత్త విషయాలు తెలిసినా తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఎలాంటి ఆదేశాలు, సూచనలు కావాలన్నా తనను వెంటనే ఫోన్లో సంప్రదించవచ్చన్నారు. ప్రతిరోజు మూడు ఆసుపత్రులను తనిఖీ చేసి సంబంధిత నివేదికలను తనకు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు.
HMPV Virus
New Delhi
China

More Telugu News