Turaka Kishore: వైసీపీ నేత తురకా కిశోర్ కు 14 రోజుల రిమాండ్

Court remands Turaka Kishore for 14 days

  • గతంలో టీడీపీ నేతలపై దాడి
  • హైదరాబాదులో తురకా కిశోర్ అరెస్ట్
  • నేడు కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమలపై మాచర్లలో దాడి చేసిన వైసీపీ నేత తురకా కిశోర్ ను పల్నాడు పోలీసులు హైదరాబాదులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తురకా కిశోర్ ను పోలీసులు నేడు మాచర్ల కోర్టులో హాజరుపరిచారు. తురకా కిశోర్ కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దాంతో పోలీసులు కిశోర్ ను గుంటూరు సబ్ జైలుకు తరలించారు. 

ఎన్నికల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన తురకా కిశోర్... బెంగళూరులోని తన సోదరుడు శ్రీకాంత్ వద్ద ఉంటున్నాడు. అయితే, హైదరాబాదులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు వచ్చి పోలీసులకు పట్టుబడ్డాడు. కిశోర్ పై 7 హత్యాయత్నం కేసులు, మరో 7 ఇతర కేసులు ఉన్నాయి.

  • Loading...

More Telugu News