Viral Videos: తల్లి, తండ్రి, పిల్లలు... చిరుత నుంచి కాపాడేదెలా?

Porcupine parents protecting babies from leopard

  • ఆకలితో ఉన్న చిరుతపులి ముళ్ల పందుల పిల్లలను వేటాడేందుకు ప్రయత్నం
  • పిల్లలను కాపాడుకునేందుకు పెద్దవాటి ఆరాటం
  • సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారిన వీడియో

ఆకలితో చిరుతపులి వేట ప్రయత్నం... తమ పిల్లలను కాపాడుకోవడానికి ముళ్ల పందుల ఆరాటం... ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారిన ఓ వీడియోకు సంక్షిప్త రూపమిది. రెండు ముళ్ల పందులు వాటి రెండు పిల్లలను తీసుకుని రోడ్డు దాటుతున్నాయి. ఇంతలో అక్కడికి ఓ చిరుతపులి దూసుకు వచ్చింది. ఆ చిరుతను ఎదుర్కొనే దమ్ము వీటికి లేదు... వీటిని వదిలిపెట్టాలనే ఆలోచన చిరుతకు లేదు.

ముళ్ల పంది పిల్లలకు ముళ్లు తక్కువ కాబట్టి వాటిని పట్టుకునేందుకు చిరుత నానా ప్రయత్నాలు చేసింది. అదే సమయంలో రెండు పెద్ద ముళ్ల పందులు తమ పిల్లలను కాపాడుకునేందుకు వెనక్కి తిరిగి చిరుత వైపు పరుగెడుతూ వచ్చాయి. అయినా చిరుత వెనక్కి తగ్గలేదు. ముళ్లు గుచ్చుకున్న కొద్దీ దూరంగా జరుగుతూ, మరోవైపు నుంచి ప్రయత్నిస్తూ వచ్చింది.
  • కేవలం ఒక నిమిషం ఉన్న ఈ వీడియో సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో అమేజింగ్‌ నేచర్‌ పేరిట ఉన్న ఖాతాలో పోస్ట్‌ అయింది.
  • దీనికి రెండు రోజుల్లోనే ఏకంగా రెండు మిలియన్లకుపైగా వ్యూస్‌, పెద్ద సంఖ్యలో లైకులు వచ్చాయి.
  • అయితే చివరగా చిరుతపులి వాటిని వదిలేసి వెళ్లిపోయిందా? లేక దేనినైనా పట్టుకుందా? అన్నది వీడియోలో లేదు. దీనితో వాటికి ఏమై ఉంటుందో అంటూ కామెంట్లు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News